ఎస్ఐ దూల మమూలుగా లేదుగా.. రెండు కార్లపై స్టంట్ - Telugu News - Mic tv
mictv telugu

ఎస్ఐ దూల మమూలుగా లేదుగా.. రెండు కార్లపై స్టంట్

May 12, 2020

Police si singam style stunt on car Madhya Pradesh 

పోలీసులు  దొంగలను పట్టుకోవడంలో, మిస్టరీలు ఛేదించడంలో ధైర్యసహసాలు ప్రదర్శిస్తే చూడ్డానికి, వినడానికి బాగుంటుంది. అలా కాకుండా ఒంటిపై యూనిఫాం ఉంది కదా అని ‘కనిపించే నాలుగో సింహమేరా..’ తరహా డైలాగులు కొట్టి, వెర్రి చేష్టలు చస్తే పరువు పోవడమే కాకుండా ఉద్యోగాలు కూడా ఊడిపోతాయ్. మధ్యప్రదేశ్లోని దామోహ్ నార్సింగ్ గర్డ్ ఎస్ఐ మనోజ్ యాదవ్ ఈ సినిమా గోల, దూల మరీ ఎక్కువ. ‘వీడేరా పోలీస్’ అనింపిచుంకోవానే ఉబలాటంతో ఓ బీభత్స స్టంట్ చేసి చిక్కుల్లో పడ్డాడు. 

అక్షయ్ కుమార్ సింగంసినిమాలో కార్ల స్టంట్ ను తానూ చేస్తానన్న మనోజ్ రెండు కార్లు తెచ్చుకున్నాడు. వాటిపై రెండు కాళ్లను పెట్టి నిలబడ్డాయి. అవి కదిలాయి. దీన్ని ఘనకార్యంగా భావించి వీడియో తీయించుకున్నాడు. అది కాస్తా వైరలైంది. అసలే కరోనా విధుల్లో బిజీగా ఉండాల్సిన పోలీసులు ఇలా చేస్తున్నారమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్పీ దర్యాప్తు చేయించి మనోజ్ కుమార్ కు పై రూ. 5 వేల జరిమానా వడ్డించారు. ఇకపై అలాంటి చేస్తే, ఉద్యోగం వదిలేసుకుని సినిమాల్లో చేరాల్సి ఉంటుందని చెప్పిపంపాడు.