Police suspect that Akanksha Dubey's death may related to a love affair with a co-actor
mictv telugu

ఇంకా మిస్టరీగానే హీరోయిన్ ఆకాంక్ష డెత్ కేసు

March 27, 2023

Police suspect that Akanksha Dubey's death may related to a love affair with a co-actor

హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ మోడల్, భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే సూసైడ్ కేసులో ఇంకా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలంటే తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. షూటింగ్ నిమిత్తం యూపిలోని వారణాసికి వెళ్లిన ఆకాంక్ష.. ఆదివారం ఉదయం సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోమేంద్ర హోటల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 25 సంవత్సరాలు. ప్రస్తుతం నాయక్ అనే సినిమా షూటింగ్లో భాగంగా ఆకాంక్ష వారణాసిలో ఉన్నారు. ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా తన రిలేషన్‌షిప్ గురించి కూడా ఓ కీలక ప్రకటన చేశారు ఈమె. తన కో-యాక్టర్ సమర్ సింగ్‌తో ప్రేమలో ఉన్నానని తెలుపుతూ అతడితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘వీరోన్ కే వీర్’, ‘కసమ్ బద్నా వాలే కి 2’ చిత్రాల్లో నటించిన ఆకాంక్ష.. భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్‌తె కలిసి నర్తించిన కొత్త పాట నిన్ననే (మార్చి 26న) విడుదలైంది. ‘ఏ ఆరా కభీ హర నహీ’ అంటూ సాగే ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లా చౌరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పార్సిపూర్ ఆకాంక్ష స్వస్థలం. భోజ్‌పురి ఇండస్ట్రీలో ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 17 ఏళ్ల వయసులోనే ‘మేరీ జంగ్ మేరా ఫైస్లా’ అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆకాంక్ష. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. రెగ్యులర్గా రీల్స్ చేస్తూ ఆ విడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆకాంక్ష దుబేకి దాదాపు 17 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు

అయితే, ఆకాంక్ష ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కో-యాక్టర్ సమర్ సింగ్తో ప్రేమ వ్యవహారం గురించి ఆరా తీస్తున్నారు. ఆకాంక్ష చావుకి అతడేమైనా కారణమై ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ఆకాంక్ష మరణంతో భోజ్‌పురి పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.