జైపూర్‌లో జార్జి ఫ్లాయిడ్‌ను తొక్కినట్లు తొక్కుతూ.. - MicTv.in - Telugu News
mictv telugu

జైపూర్‌లో జార్జి ఫ్లాయిడ్‌ను తొక్కినట్లు తొక్కుతూ..

June 5, 2020

Police thrashed a man in Jodhpur after heated argument over wearing of mask

అమెరికాలో మినియా పోలీస్ నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ ను మోకాలి కింద తొక్కి చంపిన సంఘటన ఎంత సంచలనం అయిందో అందరికి తెల్సిందే. ఇప్పటికే అమెరికాలో నిరసనలు చల్లారలేదు. తాజాగా ఇలాంటి సంఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. 

బలదేవ్‌నగర్‌కు చెందిన ముకేష్‌కుమార్ ప్రజాపతి అనే వ్యక్తి‌ మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతడికి చలాన్ విధించారు. అయితే జరిమానా కట్టేందుకు ముకేశ్ నిరాకరించాడు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగడంతోపాటు వారిపై దాడికి తెగబడ్డాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసే క్రమంలో ఓ పోలీసు అధికారి ముకేష్‌ మెడపై మోకాలితో నేలకు నొక్కిపెట్టాడు. ముకేశ్ గతంలో స్క్రూ డ్రైవర్‌తో తండ్రి కంటికి గాయం చేసిన కేసులో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటనకు సంబందించిన ప్రస్తుతం సోషల్ ‌మీడియాలో వైరల్ అవుతోంది.