పోలీసులకు భయం, దడ.. పోవడానికి ఏం చేశారంటే - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులకు భయం, దడ.. పోవడానికి ఏం చేశారంటే

March 8, 2022

21

అమ్మవారు ఆగ్రహించారని పోలీసులే తమ స్టేషన్‌లో శాంతి పూజలు జరిపించిన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. స్టేషన్ పరిధిలో క్రైం రేటు పెరిగిపోవడం, అత్యధిక రోడ్డు ప్రమాదాలు, పాము కాటుతో తోటి ఉద్యోగి చనిపోవడం, సిబ్బంది మానసిక ఆందోళన వెరసి స్టేషన్ అధికారులను శాంతి పూజలు జరిపేలా ప్రేరేపించాయి. సాధారణంగా ప్రతీ దసరాకి ప్రతీ స్టేషన్‌లో ఆయుధ పూజ చేస్తారు. కానీ, పోయినేడాది ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌లో ఎందుకనో ఆయుధ పూజ చేయలేదు. దాని వల్లనే పైన చెప్పిన దుష్ఫలితాలంటూ తెలిసిన వారందరూ చెప్పడంతో అధికారులు బ్రాహ్మణుడిని పిలిచి పోలీస్ స్టేషన్‌లోనే శాంతి పూజలు జరిపించారు. అమ్మవారు శాంతించి స్టేషన్ పరిధిలో క్రైం రేటు తగ్గించాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన చిన్నపాటి సంచలనం రేపింది.