పాల ప్యాకెట్లు దొంగలించిన పోలీస్..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

పాల ప్యాకెట్లు దొంగలించిన పోలీస్..వీడియో

January 21, 2020

iilkjh

కంచే చేనును మేసిన సంఘటన ఢిల్లీ సమీపంలోని నోయిడాలో జరిగింది. రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తూ ప్రజలను కాపాడాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారాడు. పాల ప్యాకెట్లు దొంగలిస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. ఈనెల 19న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఓ దుకాణం ముందు ఆరుబయట పాల వ్యాన్ వచ్చి, పాల ప్యాకెట్ ట్రేలను ఉంచి వెళ్లగా, అదే దారిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చింది. ఆ వ్యాన్‌లో నుంచి దిగిన ఓ కానిస్టేబుల్‌, పాల ప్యాకెట్లను దొంగలించి, వ్యాన్‌లో ఉన్న మరో కానిస్టేబుల్‌కు ఇచ్చాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్‌ను గుర్తించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.