తెలంగాణలో పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల

March 24, 2022

ppp

తెలంగాణ రాష్ట్రంలో పాలిసెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పాలిసెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు.. ఏప్రిల్ రెండో వారం నుంచి జూన్ 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా రూ. 100 ఆలస్య రుసుముతో జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని వెల్లడించింది. అనంతరం జూన్ 30న పాలిసెట్ పరీక్ష జరుగుతుందని, పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దరఖాస్తులు చేసుకొని, పరీక్షకు సన్నద్దం కావాలని ప్రభుత్వం కోరింది.