అయ్యో పవన్.. బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందా? - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో పవన్.. బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందా?

July 4, 2022

ఏపీలో పొత్తులో ఉన్న బీజేపీ – జనసేన పార్టీల మధ్య ఈ మధ్య కాలంలో దూరం పెరిగిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ కంటే ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవినే బీజేపీ ఎక్కువగా నమ్ముతున్నట్టు, అందుకే అల్లూరి విగ్రహావిష్కరణకు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీలో లేని చిరంజీవిని పిలవడం, పొత్తులో ఉన్నా సరే పవన్ కల్యాణ్‌ని పిలవకపోవడం చూస్తుంటే పై విషయం నిజమేనని నమ్ముతున్నారు చాలా మంది. బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానంటూ చెప్పిన పవన్‌కు ఈ పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేసిన పవన్.. ఆ తర్వాత జరిగిన బద్వేలు, ఆత్మకూరు ఎన్నికల్లో జనసేన నుంచి ఎలాంటి కార్యక్రమాలు బీజేపీ కోసం నిర్వహించలేదు. దీంతో పాటు బీజేపీ రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి గర్జన సభకు పవన్‌ను బీజేపీ పిలువలేదు. ఈ మొత్తం ఘటనలను చూస్తే.. వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే సూచనలు కనపడుతున్నాయని విశ్లేషకులు  భావిస్తున్నారు.