Home > పొలిటీషియన్ గా మహేష్ బాబు..!

పొలిటీషియన్ గా మహేష్ బాబు..!


సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో 24వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి భరత్ అనే నేను అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని సోమవారం నుంచి సెట్స్ పైకి వెళ్లింది. డివివి దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11, 2018న విడుదల చేయ‌నున్నారు. హైదరాబాద్ లోనే కొన్ని రోజుల పాటు షూటింగ్ ఉంటుంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన పాత్ర‌ల‌పైన కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాడు కొరటాల. త్వ‌ర‌లోనే మ‌హేష్ కూడా మూవీ టీంతో జాయిన్ అవుతున్నాడు. మ‌హేష్ 24వ చిత్రంలో ప్రిన్స్ పొలిటీషియన్ గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 22 May 2017 7:16 AM GMT
Next Story
Share it
Top