అమలా పాల్ సినిమా చూస్తే చెడిపోతారు.. మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

అమలా పాల్ సినిమా చూస్తే చెడిపోతారు.. మంత్రి

July 18, 2019

Politician's allegations against Amala Paul...........

అమలాపాల్ నటించిన తాజా సినిమా ‘ఆమె’ (తమిళంలో అడాయ్)ను చూడవద్దని పిలుపునిచ్చారు తమిళనాడుకు చెందిన మంత్రి ప్రియా రాజేశ్వరి. ఆ సినిమా చూస్తే యువత చెడిపోతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారామె. జూలై 19న విడుదల కాబోతున్న ఈ సినిమాపై మంత్రి ఈ విధంగా కామెంట్ చేయడం తమిళనాడులో సంచలనంగా మారింది. 

 ‘ఆమె’ సినిమా విడుదల నేపథ్యంలో ప్రియ మీడియాతో మాట్లాడారు. ‘పుదుచ్చేరి నుంచి వచ్చిన అమలాపాల్‌కు తమిళ ప్రజలపై కానీ, సంస్కృతిపై కానీ ఎలాంటి గౌరవం, ప్రేమ లేవు. అమల చిత్ర పరిశ్రమకు కేవలం డబ్బు కోసమే వచ్చారు. ఆ సినిమాలోని నగ్న సన్నివేశాలు యువతపై చెడు ప్రభావం చూపుతాయి. ఎటూ సెన్సార్‌ బోర్డు ‘A’ సర్టిఫికేట్‌ ఇచ్చిందని కనీసం ఆ సన్నివేశాలున్న పోస్టర్లు వాడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఆ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు కూడా కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు’ అని ప్రియ తెలిపారు.