వివేకా మృతిపై రాజకీయం.. సీఎం రమేశ్ వివాదాస్పద వ్యాఖలు - MicTv.in - Telugu News
mictv telugu

వివేకా మృతిపై రాజకీయం.. సీఎం రమేశ్ వివాదాస్పద వ్యాఖలు

March 15, 2019

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయ‌స్ వివేకానంద‌రెడ్డి మృతిపై ఒక పక్క అనుమానాలు పెరుగుతుండగా, మరో పక్క రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఆయన మృతదేహంపై గాయాలు, బెడ్ రూంలో, బాత్రూంలో ర‌క్త‌పు మ‌డుగులు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నాయి. ఈ కేసుపై కడప జిల్లా పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు.

Politics over YS Vivekananda as TDP MP CM Ramesh ridicules Jagan why he not demanding for probe with Telangana police and Nia..

మరోపైపు టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులోనూ జగన్.. తెలంగాణ పోలీసులతో, జాతీయ దర్యాప్తు  విచారణ జరిపించాలని ఎందుకు కోరడం లేదని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ఎంతో నమ్మకమైన తెలంగాణ పోలీసులతో విచారణ జరిపించుకోవచ్చు కదా అని అన్నారు. దీనిపై వైకాపా శ్రేణులు మండిపడుతున్నాయి. చనిపోయిన వ్యక్తిపై రాజకీయాలు సరికాదని అంటున్నాయి. మరోవైపు.. వివేకా మరణంపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని వైకాపా నేతలు కూడా అంటున్నారు. వివేకా మృతి వెనుక సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, ఆదినారాయణరెడ్డి హస్తం ఉందని వైఎస్ కుటుంబ బంధువు, వైకాపా నేత రవీంద్రనాథ్ ఆరోపించారు. రవీంద్ర వ్యాఖ్యలు సరికాదని టీడీపీ నేత సతీశ్ రెడ్డి విమర్శించారు. కడప ఎంపీ సీటు విషయంలో వివేకా, వైఎస్ అవినాష్‌రెడ్డికి మధ్య వివాదం నడుస్తోందని, ఈ నేపథ్యంలో వివేకా చనిపోవడం వల్ల ఆయన కుటుంబసభ్యులనే అనుమానించాల్సి వస్తోందని అన్నారు.