ఉప్పు-నిప్పు-పప్పు - MicTv.in - Telugu News
mictv telugu

ఉప్పు-నిప్పు-పప్పు

June 29, 2017

నిప్పులపై ఉప్పు వేస్తే చిటచిట మండుతోంది. పప్పులేస్తే ఉడకవ్.. ఉరికిస్తాయ్…ఉన్న పదవుల్ని ఊడగొడతాయ్..ఇంకా చెప్పాలంటే ఊచలు లెక్కిపెట్టిస్తాయ్. ఉప్పు నిప్పు ఓకే…మరి పప్పుకు ఈ పవర్ ఉందా…? దేశంలో మళ్లీ ఈ పప్పుల గోలా ఎంది రా నాయనా…?

వారంలో మూడు రోజులు ఇంట్లో పప్పు కంపల్సరీ.కొందరు ఇష్టంగా తింటే మరికొందరు ఎప్పుడు పప్పేనా అని విసుకుంటారు. ఇంట్లో వోకే.. బయట పప్పు మాట ఎత్తితే కుదరదు. ఎవరినైనా అన్నారా అంటే మీ పని అంతే. ఊస్టింగ్ ఆర్డర్స్ చేతిలో ఉంటాయి. తెలుగురాష్ట్రాల్లో పప్పు పేరు ఎత్తితే…చినబాబు అదే చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు గుర్తొస్తారు. పార్టీలో ఉన్నప్పుడు ఇంట్లోవాళ్లు..బయటవాళ్లు పప్పు పప్పు అన్నారు. అప్పుడైతే నాలుగు మాటలనేసి ఉరుకున్నారు. మంత్రి అయ్యాక కూడా అంటే ఉరుకుంటారా ఏంటీ…ఒకరినీ ఊచలు లెక్క పెట్టించారు. ఆ రోజు నుంచి ఎవరి పప్పులు ఉడకట్లేదు.

మళ్లీ సడెన్ గా యూపీలో పప్పు బయటకొచ్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడి వినయ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ని పప్పు అనేశాడు. పైగా యువరాజు గొప్పతనాన్ని చెప్పే సమయంలో పప్పు అని సంభోదించవలసి వచ్చిందని వినయ్ చెప్పుకొచ్చాడు. అయినా సీరియస్ అయిన కాంగ్రెస్ పెద్దలు సస్పెండ్ చేశారు. చివరకు పొగిడినా కూడా అర్థం చేసుకోలేని వ్యక్తి నిజంగానే ఓ పప్పు అని, ఆయనను అలా పిలిచేందుకు ఏ విధంగాను సంకోచించడం లేదని వినయ్‌ అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన..రాహుల్ కు వ్యతిరేకంగా పప్పు లేని భారత్‌ కావాలి అంటూ ప్రచార కార్యక్రమాన్ని చేపడతానని ప్రకటించారు.

చూశారా పప్పు ఎంత పనిచేసింది. అందుకే తింటే తినండి కానీ ..పప్పు పప్పు అని తిట్టకండి..అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇది నిన్నటిదాకా…లేటెస్ట్ గా సుప్రీంకోర్టు సంచలన తీర్పు…పప్పు గిప్పు అన్న ఫర్వాలేదంటోంది. ఎవరినీ ఎమైనా అనొచ్చని స్పష్టం చేసింది. ఎందుకంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని తెలిపింది. ఇక ఈ తీర్పుతో ఎంతమంది దేశంలో పప్పులు బయటకొస్తారో చూడాలి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పప్పూ టైమ్స్ నడవొచ్చు..