లాక్‌డౌన్ రోబో.. ఐడీ చూపిస్తేగానీ వదలదు - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ రోబో.. ఐడీ చూపిస్తేగానీ వదలదు

April 4, 2020

Polizei-Roboter kontrolliert Ausgangsbeschränkungen in Tunis

కరోనా మహమ్మారిని అదుపు చెయ్యాలంటే ప్రజలు ఇళ్లల్లోనే ఉండి లాక్‌డౌన్‌కు సహకరించాలని ఎంత మొత్తుకున్నా కొందరు వినిపించుకోవడంలేదు. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకోక తప్పడంలేదు. ఈ నేపథ్యంలో పోలీసుల డ్యూటీని ఓ రోబో చేస్తోంది. రోడ్ల మీదకు నిర్లక్ష్యంగా ఎవరు వచ్చినా వారిని పట్టుకుని వదలనే వదలదు. తమ వద్ద ఉన్న ఐడీకార్డు చూపిస్తేగాని వదలదు. ఈ రోబో ట్యునీసియాలో ఉంది. పోలీసులతో పాటు ఆ రోబో కూడా పెట్రోలింగ్ డ్యూటీ చేస్తోంది. నాలుగు చక్రాలు గల ఈ పోలీస్ రోబోలను ‘పీగార్డ్స్’ అని పిలుస్తున్నారు. వీటిలో థర్మల్ ఇమేజింగ్ కెమెరా, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ సాధనాలు ఉంటాయి. ఇది రాడార్‌లా పని చేసినప్పటికీ.. రేడియో తరంగాల బదులు లైట్‌ను వినియోగించుకుంటుందట. 

ఈ పోలీస్ రోబోలను ట్యునీసియా ప్రజలు కొందరు దీని సేవలు బాగున్నాయని అన్నా.. మరికొందరు మాత్రం ఇది మరీ స్లోగా నడుస్తోందని ముక్కు విరుస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వీటి పనితీరుపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఫేస్‌బుక్‌లో వీటి వీడియోలను పోస్ట్ చేస్తోంది. కాగా, ట్యునీసియా దేశంలో ప్రస్తుతం 436 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 14 మంది  మరణించారు. మాస్కులు తయారు చేసేందుకు సుమారు 150 మంది సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు.