రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో మొత్తం 9 స్థానాలకు జరుగుతుండగా అందులో 3 పట్టభధ్రలు, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగునంది. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 16న వెలువడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల నియోజవర్గాలకు సంబంధించి 1172 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగుతున్నాయి.
ఇక తెలంగాణలోనూ పాలమూరు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలీంగ్ జరుగుతుంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరుగుతుంది. దాదాపు 29వేల 720మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు అయ్యారు. ఈ ఉపాధ్యాయుల నియోజకవర్గం మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తాయి. ఈ ఎన్నికల కోసం హైదరాబాద్ లో 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.