polling started in Gujarat
mictv telugu

మందకొడిగా పోలింగ్…

December 1, 2022

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 89 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు జనాలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఓటింగ్ మందకొండిగా సాగుతోంది. ముందు ముందు ఇది పెరగొచ్చని అంచనా.

గుజరాత్ లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. మంత్రి పూర్ణేష్ మోదీ సూరత్ లోని ఓ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తొలిదశ పోలింగ్ జరుగుతున్న ఈ 89 స్థానాల్లో 2017 ఎన్నికల్లో బీజెపీ 48 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ 40 సీట్లు గెలుపొందింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలం పుంజుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో పాటుగా, భారతీయ ట్రైబల్ పార్టీ కూడా పోటీ చేస్తున్నాయి.