అరే....  ఆయన ఆరోగ్యం బాగా లేదట........ - MicTv.in - Telugu News
mictv telugu

అరే….  ఆయన ఆరోగ్యం బాగా లేదట……..

July 14, 2017

ఇసుకలో బొమ్మలు గీసి  అబ్బుర పరిచే సదర్శన్ పట్ట్నైక్ ఆరోగ్యం బాగా లేదట. కాలుష్యం బారిన పడిన సముద్రాన్ని శుద్ది చేయాలని కోరుతూ సుదర్శన్ పట్నాయక్ పూరీలో నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. సాయంత్రానికి కల్లా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందట. వెంటనే  భువనేశ్వర్ లోని అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారట. ఆయనకు బీపీ డౌన్  అయిందట. సముద్ర తీరంలో చెత్త చెదారంతో పాటు… ప్లాస్టిక్ బాటిళ్లు వేస్తున్నారట. ఇది చాలదన్నట్లు ఓ మురుగు కాల్వను కూడా దాంట్లో కలిపారట. దీంతోసముద్రం కలుషితం అవుతున్నదని సుదర్శన్ పట్నాయక్ బాధ. మంచి ఆలోచనే. ఇలాంటి వాటి గురించి మన నాయకులు… ప్రభుత్వాలు మాటలు  చెప్పడమే తప్ప చేయడం చాలా చాలా తక్వ కదా.