ఎక్కడైనా….ఏ పండు అయినా, కూరగాయ అయినా…వాటిల్లో బలం ఉంటుంది. కొన్ని తొక్కలు తినేదిగా ఉంటాయి, మంచివి కూడా. కానీ దానిమ్మ రూటే సేపరేటు.దీనికి పండులో కన్నా తొక్కలోనే బలం ఎక్కువ. బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే దానిమ్మ గింజలు కాదు తొక్కను తినండి అంటున్నారు నిపుణులు.
దానిమ్మ గింజలను చాలా ఇష్టంగా తింటారు అందరూ.దానిమ్మలో పొటాషియం, క్యాల్షియం లాంటి మినరల్‌తోపాటు పీచూ తగినంత మొత్తంలో ఉంటుంది. అలాగే విటమిన్-సి, కె, బి, ఎ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. దానిమ్మ రసంలో కొవ్వును కరిగించే ప్యూనిక్ కొల్లాజెన్, ప్యూనిక్ యాసిడ్ ఉంటాయి. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు కరుగుతుంది. అయితే దానిమ్మ గింజల కంటే దాని తొక్కలో ఇంకా ఎక్కువ పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. NCBI ప్రకారం, దానిమ్మ తొక్కల్లో ఫినోలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్లు, హైడ్రోలైజబుల్ టానిన్లు, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ షార్ప్‌గా ఉండటానికి ఈ పోషకాలు చాలా ముఖ్యం.
ఒత్తిడి కారణంగా.. మెదడు నెమ్మదిగా తన సామర్ధ్యాన్ని తగ్గించుకుంటుంది.ఇది మతిమరపు, అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలకు దారితీస్తుంది. దానిమ్మ తొక్కలను తీసుకునే వ్యక్తుల మెదడు బాగా పనిచేస్తుందని పబ్మెడ్ పరిశోధనలో తేలింది. దానిమ్మ తొక్కలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. తరచుగా దానిమ్మ తొక్కల టీ తాగితే.. బ్రెయిన్ చురుకుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. రెండు మూడు రోజులు ఎండబెట్టాక వాటిని పొడిలా చేసుకోవాలి. దీన్ని నీళ్ళల్లో బాగా మరగబెట్టుకుని తాగడమే. ఇలా రోజూ తాగితే చాలా మంచిది. దానిమ్మ తొక్కల వలన ఒక్క బ్రెయిన్ మాత్రమే కాదు ఇంకా చాలా సమస్యలు దూరం అవుతాయి. గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.దగ్గును తగ్గిస్తుంది. కడుపులో సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి.మొటిమలు, వాటి మచ్చలు మాయం అవుతాయి. ముడతలు తొలగుతాయి. చూశారుగా ఒక్క తొక్క వల్ల ఎన్ని లాభాలో. మరింకేంటి ఆలస్యం ఈరోజే దానిమ్మలను కొనుక్కోచ్చేయండి. తొక్కల టీ తాగేయండి.
ఇవి కూడా చదవండి :
యంగ్ గా కనిపించాలా అయితే మందు మానేయండి….