Home > Featured > పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై దాడి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై దాడి

Ponguleti Srinivas Reddy camp office attacked by strangers In Khammam

ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆఫీస్ పై దాడి చేశారు. ఆ టైంలో ఆఫీస్ కు తాళం ఉండి, ఎవరు లేకపోయేసరికి బయటున్న కుర్చీలు, ఫ్లెక్సీలు, పూల కుండీలను ధ్వంసం చేశారు.

గట్టిగా అరుస్తూ ఫ్లెక్సీలు చించేస్తుండగా.. స్థానికులు గట్టిగా కేకలు పెట్టడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ పై దాడి చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated : 28 May 2023 9:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top