గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వైఎస్ఆర్‌టీపీలో చేరికపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. లోటస్ పాండ్ లో నిర్వహించిన సమావేశంలో.. పొంగులేటి భేటీ నిజమే. ఆయన పార్టీ చేరికపై నాకు క్లారిటీ ఇచ్చారు. ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి తమ పార్టీలో చేరతారని తనకు మాటిచ్చారని షర్మిల అన్నారు. YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని పొంగులేటి అనుచరులు ఖండించారు. అయితే తాజాగా వైఎస్ షర్మిల పొంగులేటి భేటీపై పూర్తి స్పష్టత ఇచ్చారు.
ఇక ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర ఎక్కడ ఆగిందో.. నేడు అక్కడి నుంచే ప్రారంభం కానుంది. హైకోర్టు, వరంగల్ సీపీ అనుమతులతో తిరిగి పాదయాత్ర కొనసాగనుంది. వరంగల్ జిల్లాలో చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండాలో ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. తన పాదయాత్ర గురించి కూడా మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్‌ను అడ్డుపెట్టుకుని కొందరు తన పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎక్కడ నా యాత్రను ఆపారో అక్కడి నుంచే మళ్లీ ప్రారంభిస్తున్నానని తెలిపారు.
శంకరమ్మ తండా, లింగగిరి, సూరిపల్లి ఎక్స్ రోడ్, తోపనగడ్డ తండా, నెక్కొండ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర 5.30 గంటలకు నెక్కొండకు చేరుకుంటుంది. అక్కడ మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించిన అనంతరం నెక్కొండలోనే షర్మిల బస చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
మన దేశంలో ప్రభుత్వాలు ఎన్నికల కోసమే పనిచేస్తాయి.. మంత్రి కేటీఆర్
ఉద్యోగులకు టయోటా గ్లాంజాను బహుమతిగా ఇచ్చిన సీఈవో!