Ponnayan Selvam First Day Box Office Collections
mictv telugu

పొన్నియన్ సెల్వం తొలిరోజు వసూళ్లు.. తమిళంలో మూడో స్థానం

October 1, 2022

Ponnayan Selvam First Day Box Office Collections

ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వం తొలి భాగం శుక్రవారం విడుదలైంది. తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ నటులు ఇందులో నటించగా, దక్షిణాదిలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ వసూళ్లలో మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అక్కడ తొలిరోజు రూ. 25.86 కోట్లు వసూలు చేసి తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలో అజిత్ నటించిన వాలిమై (36.17 కోట్లు), రెండో స్థానంలో బీస్ట్ (26.40 కోట్లు) ఉన్నాయి. హిందీలో సైఫ్ ఆలీ ఖాన్, హృతిక్ రోషన్ నటించిన విక్రమ్ వేదాను తట్టుకొని ఈ చిత్రం తొలిరోజు రూ. 1.75 కోట్లు రాబట్టింది. అటు అమెరికాలో వరుసగా రెండ్రోజులు ఒక మిలియన్ మార్కు రాబట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి చూస్తే మొత్తంగా రూ. 8 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కాగా, రూ. 500 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సిరీస్లో రెండో భాగం కూడా ఉంది.