. 'Ponniyan Selvan's record entry into the 200 crore club
mictv telugu

‘పొన్నియన్‌ సెల్వన్‌ రికార్డ్..200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

October 3, 2022

తమిళ సినీ చరిత్రలోనే అత్యంత వేగంగా ‘పొన్నియన్‌ సెల్వన్‌’ కలెక్షన్ల మీద కలెక్షన్లను వసూలు చేస్తూ, కొత్త రికార్డ్‌ను సృష్టిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో మంచి టాక్‌ను సొంతం చేసుకొని, కొద్ది రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి నటులు నటించారు. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను క్రియేట్‌ చేసింది. ఆ ప్రకారమే విడుదలైన రోజు నుంచి నేటివరకు దూసుకుపోతోంది.

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మణిరత్నం తెరకెక్కించినిన ఈ ‘పొన్నియన్ సెల్వన్ (పీఎస్‌1)’ పార్ట్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 230 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు, ఈరోజు రూ. 250 కోట్ల మార్క్‌ను అధిగమించబోతోంది. వ‌సూళ్ల వ‌ర్షం ఇదే స్పీడ్‌లో కొనసాగితే, ఈ చిత్రం తొంద‌ర్ల‌నే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల్లోకి దూసుకుపోయే అవకాశం ఉంది.

ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం విషయానికొస్తే.. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో సెప్టెంబర్ 30న విడుదలైంది. విడుద‌లైన మూడు రోజుల్లో (తొలి వారాంతంలోనే) ప్ర‌పంచవ్యాప్తంగా రూ. 230 కోట్ల పైచిలుకు కలెక్షన్లను సాధించింది. ఐమాక్స్ స్క్రీన్లలో ఉత్తర అమెరికా మినహా ప్ర‌పంచవ్యాప్తంగా ఆల్-టైమ్ నెం.1 ఓపెనింగ్ చిత్రంగా నిలిచింది.

అంతేకాదు, అమెరికాలోని ఐమాక్స్‌ల్లో ఆల్-టైమ్ నెం.3 ఓపెనింగ్‌ను ఈ సినిమా రాబ‌ట్టింది. భారతదేశంలో ఐమాక్స్‌లో ఆల్-టైమ్ నెం.4గా నిలిచింద‌ని ర‌మేశ్ బాలా పేర్కొన్నారు. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ ‘పొన్నియిన్ సెల్వన్’ నిర్మించబడింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించ‌గా.. రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్య‌వ‌హ‌రించారు.