Ponniyin Selvan 1 Star Cast Remuneration Details
mictv telugu

‘పొన్నియన్ సెల్వన్-1’ రెమ్యూనరేషన్‌లో ఆమెనే హీరో

September 30, 2022

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 1’. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ రాజ్యపు రాజుల గొప్పతనం గురించి, చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా.. మణిరత్నం ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. సినిమాలోని చారిత్రాక పాత్రల కోసం ఆయన ఏరి కోరి అద్భుతమైన నటులను తీసుకున్నారు. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, ప్రకాష్ రాజ్, ప్రభు లాంటి దిగ్గజ నటులు ఇందులో నటించారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఆయా నటుల పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో పలు తమిళ వెబ్‌సైట్లు పొన్నియన్‌ సెల్వన్‌ నటీనటుల పారితోషికాలకు సంబంధించిన కథనాలు వెలువరించింది. ఆయా పాత్రలు, సినిమాలో వాటి నిడివి ప్రకారం చియాన్‌ విక్రమ్‌ ఈ సినిమా కోసం రూ. 12 కోట్లు తీసుకున్నాడట. ఆ తర్వాత అంత మొత్తంలో రెమ్యూనషన్ తీసుకున్న వారి లిస్ట్ లో ఐశ్వర్య రాయ్‌ ఉన్నారు. మిగతా హీరోల కంటే, ఆర్టిస్టుల కంటే కూడా ఐశ్వర్వ రూ. 10 కోట్లు అందుకున్నారని తెలిసింది. ఇక జయం రవి రూ. 8 కోట్లు, కార్తి రూ. 5 కోట్లు తీసుకోగా త్రిష రూ. 2.5 కోట్లు తీసుకున్నారు సమాచారం. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌పై సుభాస్కరన్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మించారు. ఆర్‌.రెహమాన్‌ సంగీత దర్శకుడు.