హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా ‘పొన్నియన్ సెల్వన్’ పార్-2 అప్ డేట్ వచ్చేసింది. 2023 ఏప్రిల్ 28న చిత్రం రెండో భాగం విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. విక్రమ్, జయం రవి, కార్తి, నందిని పాత్రలను ఆ వీడియోలో చూపించారు. ఇప్పటికే విడుదల లేది బయటకు రాగా..ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం భారీ అంచనాల మధ్య విడుదలై విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తమిళంలోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. పొన్నియిన్ సెల్వన్’ తెలుగు వెర్షన్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ముప్పై సంవత్సరాలుగా మణిరత్నం యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. అందుచే చాలా ఇష్టంగా సినిమాను రూపొందించారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.