Ponniyin Selvan I teaser out! Battle lines are drawn in Aishwarya Rai-Vikram starrer, watch video
mictv telugu

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ టీజర్‌ విడుదల

July 8, 2022

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రెస్టేజియస్ మూవీ పొన్నియిన్ సెల్వన్. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. 10వ శతాబ్దంలో చోళరాజుల కాలానికి సంబంధించిన కథతో రూపొందుతోంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ ముఖ్య పాత్ర పోషించగా.. కార్తి , త్రిష ,, ఐశ్వర్య రాయ్, ప్రకాష్ రాజ్ , జయం రవి, జయరాం , ప్రభు, శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు మణిరత్నం.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల చేయనున్నారు. ఇక తెలుగు టీజర్‌ను మహేశ్‌బాబు, హిందీలో అమితాబ్‌, మలయాళంలో మోహన్‌లాల్‌, కన్నడలో రక్షిత్‌ శెట్టి, తమిళంలో సూర్య విడుదల చేశారు. తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ సినిమా పొన్నియిన్ సెల్వన్ టీజర్ రిలీజ్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని పేర్కొన్నారు. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ టీజర్ వైరల్ అయింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.