జీనియస్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ పొన్నియన్ సెల్వన్. చోళరాజుల కాలం నాటి ఒక కథను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో ఆయన కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు. ఈ కథను ఆయన రెండు భాగాలుగా చెప్పనున్నారు. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధానమైన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ వారి పోస్టర్లను వదులుతూ వస్తున్నారు. అలా తాజాగా కార్తి పోస్టర్ ను రిలీజ్ చేశారు. యుద్ధ వీరుడిగా కార్తి లుక్ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన పోస్టర్లో కార్తీ.. చిరునవ్వు చిందిస్తూ.. రాజసం ఉట్టిపడేలా ఉన్నాడు. లేటెస్ట్గా విడులైన ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. మొదటి భాగం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.