Ponnur Mla Roshaiah In Pawan Kalyan Birthday Celebrations And Photos Goes Viral
mictv telugu

పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్యే.. సోషల్ మీడియాలో రచ్చ

September 5, 2022

 

ఏపీలోని అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే అయి ఉండి.. జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడాన్ని వైసీపీ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. వైసీపీలో ఉంటూ మరో పార్టీ అధినేత పార్టీ కార్యక్రమాలకు తన ఫంక్షన్ హాల్‌ను ఫ్రీగా ఇచ్చారని పోస్ట్‌లు పెడుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పెదకాకాని మండలం ఉప్పలపాడులో.. జనసేన ఆధ్వర్యంలో జరిగిన పవన్‌ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో.. ఎమ్మెల్యే రోశయ్య జనసేన నాయకులతో కలిసి భోజనం వడ్డించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వ్యవహారం కాస్త స్థానికంగా చర్చనీయాంశంగా మారడంతో సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారని సమాచారం. వైఎస్సార్‌సీపీలో ఉంటూ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి మెగా హీరోల బర్త్ డే వేడుకలు చేస్తున్నారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే తీరుపై స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.