పూజా హెగ్డే పెద్దమనసు.. కేన్సర్ బాధితులకు విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

పూజా హెగ్డే పెద్దమనసు.. కేన్సర్ బాధితులకు విరాళం

January 20, 2020

hghbng

సినీతారల్లో కొందరు కేవలం డబ్బుకే ప్రాధాన్యం ఇస్తారు. మరికొందరు సంపాదనే కాకుండా సమాజానికి కూడా తమ వంతు సేవల చేస్తుంటారు. టాలీవుడ్‌ నటి పూజా హేగ్డే కూడా ఆ బాటలోనే నడుస్తుంటారు. కేన్సర్ బాధిత చిన్నారుల కోసం రూ.2.5 లక్షలను విరాళంగా ప్రకటించారు.

 హైదరాబాద్‌లో గోల్ఫ్‌ క్లబ్‌లో నిర్వహించిన ‘క్యూర్‌ ఫౌండేషన్‌’ కార్యక్రమంలో పూజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాను డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చానని, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవడం అందరికి బాధ్యత అని ఆమె అన్నారు. ‘మా అన్నయ్య డాక్టర్. నా స్నేహితుల్లో చాలామంది కూడా వైద్యులే. డాక్టరే అసలై హీరో అని  భావిస్తాను. కేన్సర్ బాధిత బాలలను ఆదుకోడానికి మనం నిధులు సమకూర్చాలి. చాలామంది మంచి పనులు చేయాలని ఉంటుంది. అయితే ఎలా చేయాలో తెలియదు. సొంతంగా చేయలేని వారు స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వాలి..’ అని ఆమె కోరారు.