నాలుగు గోడల మధ్య ఏమైనా చేసుకోవచ్చేమోగాని పబ్లిక్‌లో వచ్చినప్పుడు కాస్త ముందూ వెనకా, చట్టం చట్టుబండా చూసుకుని మరీ పనిచేసుకుపోవాలి. మోడల్, నటి పూనమ్ పాండేకు ఆ విషయం సరిగ్గా తెలియక అరెస్టయింది. బహిరంగ ప్రదేశంలో ‘బూతు వీడియో’ షూటింగ్లో పాల్గొన్నట్లు పూనమ్‌పై ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆమెను కటకటాల వెనక్కి నెట్టారు.
పూనమ్ ఇటీవల గోవాలోని చపోలి బ్రిడ్డి వద్ద ఓ ‘అశ్లీల వీడియో’ షూట్లో పాల్గొందని ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూనమ్ గోవా సంస్కృతి, చపోలీ డ్యామ్ పవిత్రతను దెబ్బ తీసిందని పేర్కొంది. దీంతో పోలీసులు పూనమ్‌పై, ఆమెను వీడియో తీసిన వ్యక్తిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మోడల్ మిలింద్ సోమన్ బీచ్‌లో నగ్నంగా పరిగెత్తిన ఫోటో కూడా తోడు కావడంతో ఆడవాళ్లపై వివక్ష ఎందుకు అని మహిళా కార్యకర్తలు మండిపడుతున్నారు. 55 ఏళ్ల వయసులో మిలింద్ నగ్నంగా పరిగెత్తితే ‘ఫిట్నెస్ బాగా మెయింటెయిన్ చేస్తున్నాడని అంటున్నారు. మరోపక్క పూనమ్‌ను మాత్రం తిడుతున్నారు’ అని ప్రశ్నిస్తున్నారు.పూనమ్ పాండే ఇటీవలే పెళ్లి చేసుకుని భర్తపై కేసు పెట్టడం, తర్వాత ఇద్దరూ రాజీపడటం తెలిసిందే.