పూనం ట్విస్ట్.. భర్తను క్షమించేసిందట, కాపురం చేస్తుందట! - MicTv.in - Telugu News
mictv telugu

పూనం ట్విస్ట్.. భర్తను క్షమించేసిందట, కాపురం చేస్తుందట!

September 28, 2020

Poonam Pandey's Husband Sam Bombay Gets Bail in Assault Case

పెళ్లి అయిన 20 రోజులకే పెటాకులు చేసుకున్న బాలీవుడ్ భామ పూనమ్ పాండే మనసు మార్చుకుంది. భార్యాభర్తలు అన్నాక సవాలక్ష అనుకుంటారు.. గిల్లికజ్జాలను పట్టించుకుని కాపురాలను కూల్చుకుంటామా అని సగటు వివాహితగా ఆలోచించినట్టుంది. అందుకే యూటర్న్ తీసుకుని తన కాపురాన్ని చక్కదిద్దుకుంది. గోవాలో ఓ వైపు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు భర్త సామ్ బోంబేతో పూనమ్ హనీమూన్‌ను ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. తన భర్త  తనను వేధించాడని, దాడి కూడా చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరుసటి రోజే అతడు బెయిల్‌పై బయటికి వచ్చాడు.  ఈ నేపథ్యంలో పూనమ్ ట్విస్ట్ ఇచ్చింది. భర్త సామ్ బాంబేపై పెట్టిన కేసు వాపసు తీసుకోవాలని నిర్ణయించినట్లు తాజాగా వెల్లడించింది. 

భర్త తన ముందు కూర్చుని చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడని.. జీవితంలో మళ్లీ కొట్టనని ఒట్టు వేశాడని పూనమ్ తెలిపింది. ‘నా భర్త పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోంది. అందుకే కేసు వాపసు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. వైవాహిక జీవితంలో ఎత్తు పల్లాలు కామన్. భర్తతో కలిసిపోయి వివాహ జీవితాన్ని హ్యాపీగా కొనసాగించాలని భావిస్తున్నాను. మేమిద్దరం ఘాడంగా ప్రేమించుకుంటున్నాం. బలమైన ప్రేమలో ఉన్నాం. దాంపత్య జీవితంలోని హెచ్చుతగ్గులు మమ్మల్ని ఏమాత్రం ఆపలేవు’ అని పూనమ్ స్పష్టంచేసింది. ఈ మేరకు శనివారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడు సామ్ బాంబేను పూనమ్ పాండే సెప్టెంబర్ 1న పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ షూటింగ్ నిమిత్తం భర్తతో కలిసి గోవా వెళ్లింది. అక్కడే ఆ జంట హోటల్‌లో హనీమూన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భర్త తనను తీవ్రంగా కొట్టాడంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.