శభాష్.. పేదరాలికి పెళ్లి చేసిన టీచర్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

శభాష్.. పేదరాలికి పెళ్లి చేసిన టీచర్లు..

February 9, 2018

గురు దేవో భవ అన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి భావి పౌరులుగా తీర్చిదిద్దే గురువులు సమాజానికి చాలా అవసరం. వారు కేవలం పిల్లల బాగోగులనే కాకుండా సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాయి. అయితే మ‌ధ్యప్ర‌దేశ్‌ విదిశ జిల్లా పిప‌ర్‌గుహ ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉపాధ్యాయులు  మరో అడుగు ముందుకేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

పిప‌ర్‌గుహ గ్రామంలో ఒక పేదకుంటుంబంలో పెళ్లి కావాల్సిన యువతి ఉంది. తల్లిదండ్రులు కట్నం ఇచ్చి పెళ్లి  చేసే పరిస్థితి లేదు. అయినా ఒక సంబంధం కుదరింది. అయితే వధువు కుటుంబం వద్ద  పెళ్లి ఖర్చులకు డబ్బులేదు.

ఈ విషయాన్ని గమనించిన టీచర్లు తలా ఓ చెయ్యి వేశారు. పెళ్లి కావాల్సిన ఖర్చును వారే భరించారు.  ఒకేసారి కాకుండా ప్ర‌తి నెలా తమ జీతాల్లోంచి కొంతమొత్తాన్ని ఆమె పెళ్లి కోసం పొదుపు చేస్తూ వచ్చారు. అమ్మాయికి తమ స్కూల్లోనే ఘనంగా వివాహం జరిపించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇకముందూ తాము సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని టీచర్లు చెప్పారు.