వైద్యానికి డబ్బులులేని పేదతల్లి.. 14 ఏళ్లుగా కొడుకును కట్టేసి - MicTv.in - Telugu News
mictv telugu

వైద్యానికి డబ్బులులేని పేదతల్లి.. 14 ఏళ్లుగా కొడుకును కట్టేసి

September 27, 2020

MFYKF

పేదరికం జీవితాలను శాసిస్తుంది అనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. డబ్బులేని వారికి ఎలాంటి రోగాలు రాకపోవడమే పెద్ద వరం. పేదరికం కారణంగా మతిస్థిమితం లేని తన కుమారుడికి వైద్యం చేయించలేక ఓ తల్లి 14 ఏళ్లుగా గొలుసులతో బంధించింది. డబ్బులు లేక వైద్యం చేయించకపోవడంతో వ్యాధి ముదిరిన కొడుకు ఇతరులపై దాడులు చేస్తున్నాడు. దీంతో ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. తన కుమారుడిని గొలుసులతో కట్టి కదలకుండా చేసింది. పద్నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు సదరు యువకుడు మతిస్థిమితం కోల్పాయాడని తెలుస్తోంది. గుండెలను పించేస్తున్న ఈ సంఘటన పూరిలో చోటు చేసుకుంది. 

బాధిత యువకుడి పేరు రామచంద్ర. అతడి తల్లి జగన్నాథుడి ఆలయం వద్ద నిర్మాల్యం అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటుంది. కొడుకుకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మతి స్థిమితం కోల్పోయాడని తల్లి వివరించింది. ఇతరులపై దాడులకు పాల్పడుతుండటంతో ఇంట్లో మంచానికి గొలుసులతో కట్టేశానని తెలిపింది. చికిత్సకు డబ్బులు లేక తన కొడుకుకి వైద్యం చేయించలేదని వాపోయింది. వారి పరిస్థితి గురించి తెలసుకున్న హోప్ ఈజ్ లైఫ్ అనే స్వచ్ఛంధ సంస్థ సెక్రెటరీ చలించిపోయారు. వెంటనే సోషల్ వెల్ఫేర్ అధికారులతో సంప్రదించి రామచంద్రను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఇన్నాళ్లుగా మానసిక సమస్యలతో సతమతమవుతున్న తన కుమారుడి సమస్యకు పరిష్కారం దొరుకుతున్నందుకు ఆ తల్లి దుఃఖాన్ని ఆపులేకపోయింది. పూరి జగన్నాథుడు తన మొర ఆలకించాడంటూ కన్నీరుమున్నీరు అయింది. కాగా, మరో విషాధం ఏంటంటే.. ఫనీ తుఫాన్ కారణంగా వారు ఉంటున్న గుడిసెను కూడా కోల్పోయారు. ఆమె వద్ద రేషన్ కార్డు కూడా లేకపోవడంతో ప్రభుత్వ సాయం ఆమెకు అందలేదు.