మెడిసిన్ సీటు వచ్చింది.. ఫీజుకు డబ్బుల్లేవు, 30 లాస్ట్ డేట్! - MicTv.in - Telugu News
mictv telugu

మెడిసిన్ సీటు వచ్చింది.. ఫీజుకు డబ్బుల్లేవు, 30 లాస్ట్ డేట్!

March 28, 2022

ktr

కష్టాలకు వెనకాడకుండా చదువులో సత్తా చాటి ఎంబీబీఎస్ సీటు సాధించిన పేద విద్యార్థిని సాయం కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తోంది. కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బుల్లేక్ల ఇబ్బది పడుతోంది. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆమెకు సాయంగా ఉంటామని హామీ ఇచ్చారు! నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చల్మెడ గ్రామానికి చెంది గాదెపాక ప్రశాంతి ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో 4134వ సాధించింది. ఆమెకు మహబూబ్ నగర్‌లోని ఎస్వీస్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఈ నెల 30 లోపు రూ. 2.5 లక్షలు కాలేజీ ఫీజు కింద చెల్లించాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో ప్రశాంతి తల్లిదండ్రులు ఆ డబ్బులు కట్టే స్థితిలో లేరు. ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ కార్యాలయ సిబ్బంది తమకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని ప్రశాంతి తెలిపింది. ప్రశాంతి తల్లిదండ్రులు కూలినాలి చేసి జీవితం నెట్టుకొస్తున్నారు. లక్షల ఫీజు కట్టి చదివించే స్తోమత లేదని, తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రశాంతి మోత్కూర్ మండలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్త చేసింది. గౌలిదొడ్డిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న నీట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంది.