టికెట్ రాదని.. వైకాపా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం! - MicTv.in - Telugu News
mictv telugu

టికెట్ రాదని.. వైకాపా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం!

March 16, 2019

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కదనే మనస్తాపంతో ఆయన మణికట్టు కోసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన మదనపల్లెలోని చంద్రమోహన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతకు ముందు.. తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని ఆయన సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. 

Pootalapattu YSRCP MLA Sunil Kumar suicide attempt for denying ticket in assembly elections  

అయితే తన భర్త ఆత్మహత్యకు యత్నించలేదని, శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గటంతో బాత్రూంలో పడిపోయారని ఆయన భార్య పోలీసుకు చెప్పినట్లు సమాచారం. బాత్రూంలో పడడం వల్ల మణికట్టుకు కోసుకోయిందని ఆమె చెప్పారని, దీనిపై పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. సునీల్ ఇటీవల జగన్‌ను కలవడానికి లోటస్‌పాండ్‌కు వెళ్లారు. మూడు రోజులు వేచిచూసినా ఆయన జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఆయన మనస్తాపంతో సెల్ఫీ వీడియోను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. తనక టికెట్ ఇవ్వకపోయినా ఫర్వాలేదని, మీతో ఉండనిస్తే చాలని అన్నారు. జగన్ గొప్పనాయకుడని, దళితులు ఆయనను గెలిపించాలని కోరారు.