pop francis comments on war over russia
mictv telugu

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి అసలు కారణం చెప్పిన పోప్

May 6, 2022

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి గల అసలు కారణాన్ని క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. ‘రష్యా అనే ఇంటి ముందు నాటో అనే కుక్క మొరగడమే’ అసలు కారణమని తేల్చి చెప్పేశారు. ఇదే సమయంలో నాటో లీడర్ అమెరికాను విమర్శించారు. ఇటలీలోని స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా తీరుపై ప్రశ్నించగా ‘రష్యా సరిహద్దుల్లో నాటో ఉనికిని పుతిన్ తట్టుకోలేకపోయాడు. దాని ఫలితమే ఈ దురాక్రమణ’ అని స్పష్టం చేశారు.

ఈ మారణ హోమాన్ని 1990వ దశకంలో రువాండాలో జరిగిన మారణకాండతో పోల్చి చెప్పారు. అప్పుడు టుట్సీ తెగకు చెందిన మైనార్టీలు దాదాపు 8 లక్షల మంది చనిపోయారని గుర్తు చేశారు. ప్రస్తుత యుద్ధాన్ని ఆపడానికి ఉక్రెయిన్‌కు వెళ్లడం కంటే రష్యా వెళ్లి పుతిన్‌కు నచ్చజెప్పడమే సరైనదని అభిప్రాయపడ్డారు. పుతిన్‌తో మాట్లాడడానికి తాను సమయం కోరానని, కానీ, రష్యా నుంచి ఎలాంటి బదులు రాలేదని వివరించారు. అయినా యుద్ధాన్ని అపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.