జలుబు చేసిందా? అయితే పాప్‌కార్న్ వేసుకోండి! - MicTv.in - Telugu News
mictv telugu

జలుబు చేసిందా? అయితే పాప్‌కార్న్ వేసుకోండి!

December 9, 2019

Popcorn 01

జలుబు! మాత్రలు వేసుకుంటే వారం రోజుల్లో, లేకపోతే ఏడురోజుల్లో తగ్గిపోతుంది. కొన్ని రోజులే వేధించినా ఆ బాధ మటుకు వర్ణనాతీం. కాస్త జలుబు చేయగానే కోల్డ్ యాక్ట్, సిట్రిజెన్ వంటి మాత్రలు వేసుకోవడం మామూలే. కొందరు ఆవిరి పడతారు. మొత్తానికి అప్పటికప్పుడు ఉపశమనం కోసం ఏదో ఒకటి వాడాల్సిందే. అయితే అలాంటివేమీ వద్దని, ఎంచక్కా పాప్ కార్న్ తింటే జలుము మాయమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ స్క్రాంటన్‌కు చెందిన పరిశోధకులు జలుబు నివారణ మార్గాలపై  అధ్యయనం చేశారు. కాస్త వేడిగా ఉండేవాటితోపాటు కొన్నిమసాలా వస్తువులు పడిశాన్ని తగ్గిస్తాయన్న సూత్రాన్ని పరిశీలించారు.  అందులో భాంగా పాప్‌కార్న్‌ను కూడా విశ్లేషించారు. అందులో పాలీఫినాల్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ పాళ్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. జలుబు నివారణకు ఇవి దోహదపడతాయి. పైగా మిగతా ఆహారపదార్థాల్లో దొరికే యాంటీ ఆక్సిడెంట్లకంటే కార్న్ లోని ఆక్సిండెంట్లు రుచికరంగానూ ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే కాస్త ఉప్పు తగ్గించాలని, ఉప్పు ఎక్కువైతే ఆక్సిడెంట్లు ప్రభావం చూపవని సూచించారు.  పాప్ కార్న్ సంగతి పక్కనబెడితే జలుబు, దగ్గు నివారణకు మన దేశంలో పప్పులు, మిరియాలు వంటివి వాటిని ఎప్పటినుంచో వాడేస్తున్నారు.