popular dialogues from balakrishna veera simha reddy movie
mictv telugu

ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు అంటూ వైసీపీని టార్గెట్ చేసిన బాలయ్య

January 12, 2023

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులు హైలెట్ కాగా, సాయి మాధవ్ బుర్రా రాసిన కొన్ని డైలాగులు మాత్రం పొలిటికల్ అజెండాతో అధికార వైసీపీని టార్గెట్ చేసినట్టు అనిపిస్తున్నాయి. ‘వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు.. గౌరవించడం మన బాధ్యత’ అనే డైలాగు వివాదం రేపుతోంది. ఈ ఒక్కటే కాదు ఇలాంటివి మరికొన్ని డైలాగులు వైసీపీపై బాణం ఎక్కుపెట్టినట్టు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
1. వాడు దోచుకోవడానికి వచ్చాడు.. నాట్ అలౌడ్
2. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర క్రియేట్ చేసిన వ్యక్తి పేరు మారదు. మార్చలేరు.
3. బలం చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ.
4. మూతి మీద మొలిచిన ప్రతీ బొచ్చు మీసం కాదురా బచ్చా..
5. సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాల కోసం. నాది ఫ్యాక్షన్ కాదు సీమపై ఎఫెక్షన్
6. ఇది రాయల సీమ.. రాయల్ సీమ.. గజరాజులు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తాయి. రాజును చూడు కుక్కను కాదు.
7. ఏది అభివృద్ధి మిస్టర్ హోం మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజలను వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమేయడం కాదు. పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు. నిర్మించడం.. అభివృద్ధి.. కూల్చడం కాదు. పరిశ్రమలను తీసుకురావడం అభివృద్ధి.. ఉన్నవాటిని మూయడం కాదు. బుద్ది తెచ్చుకో.. అభివృద్ధి అర్ధం తెలుసుకో.
8. వీర సింహారెడ్డి.. ఆ పేరు వింటే వేట కొడవళ్ల వెన్నెముఖలో కూడా వణుకు పుడుతుంది. భూమిమీద బతకడానికి అందరూ పుడతారు. కానీ భూమిని బతికించడానికి పుట్టిన సింహం.
9. బాధ్యతగా చంపుతా.. మళ్లీ పుట్టడానికి మళ్లీ భయపడేట్టు చంపుతా.
10. అడవికి రాజు ఉంటుంది. మృగాలన్నింటినీ కంట్రోల్‌లో పెట్టి అడవిని పాలిస్తుంది. ఆ రాజు పేరు సింహం.
11. కాపు కాసిన కర్నూలోళ్లు.. చుట్టుముట్టిన చిత్తూరోళ్లు.. కమ్ముకొస్తున్న కడపోళ్లు.. కత్తి పట్టిన అనంతపురమోళ్లు ఎగసికొస్తున్నారు. ఎండ నడినెత్తికి ఎక్కేలోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరువేద్దాం.
12. ఎన్ని వందల మందినైనా వెంటేసుకుని రా. చివరి తల తెగే వరకు కత్తి వదలను చేయి మార్చను. ఒంటి చేత్తో ఊచకోత కోస్తా నా కొడకా.