popular heroin characters in 2022, telugu movies
mictv telugu

రాధిక నుంచి నాగలక్ష్మి వరకు…. 2022 రౌండప్

December 29, 2022

popular heroin characters in 2022

సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. సినిమా ఆడిందా లేదా, ఆ క్యారెక్టర్ మంచిదా, చెడ్డదా అన్న దానితో సంబంధం లేకుండా అవి గుర్తుండిపోతాయి. వాటి పేర్లు నోళ్ళల్లో నానుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలో వచ్చిన తెలుగు సినిమాల్లో అలా గుర్తుండిపోయిన ఆడ లేడీ క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. వాటి పేర్లు చాలా కాలం వరకూ…ఇప్పటి వరకూ కూడా మనం తలుచుకుంటూనే ఉన్నాం. వాటిని వాడుతూనే ఉన్నాం. అవేంటో మీరు కూడా ఓ లుక్కేసేయండి.

రాధిక:

ఈ ఏడాది బాగా నానిన పేరు రాధిక. డీజేటిల్లు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు రాధిక. ఇందులో హీరోయిన్ ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. దాన్ని తప్పించడానికి హీరో ప్రయత్నిస్తూ ఉంటాడు. దానివల్ల ఇద్దరి మధ్య గొడవలూ, ప్రస్ట్రేషన్ ఉంటుంది. ఒకరకంగా హీరోయిన్ ది కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఇందులో హీరో హీరోయిన్ మీద ఉన్న కోపాన్ని తీర్చుకునే తీరు ప్రేక్షకులను మెప్పించింది. తన మాటలతో రాధిక పేరును రకరకాలుగా అంటుంటాడు. మధ్యలో ఓసారి అక్కా ని కూడా అంటాడు. ఇలా హీరో టీజ్ చేయడం వలన ఈ క్యారెక్టర్ కు మంచి పేరు వచ్చింది. అందరికీ గుర్తుండిపోయింది. నావల్ల అయితలేదు రాధికా….ఈ డైలాగ్ వాడని వాళ్ళు లేరు.

వెన్నెల:

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రేమకథ విరాటపర్వం. కామ్రేడ్ రవన్నను ప్రేమించి నక్సలైట్ గా మారి అన్యాయంగా చనిపోయే పాత్ర వెన్నెలది. సాయిపల్లవి చేసిన దీనికి మంచిపేరు వచ్చింది. అసలు ఈ క్యారెక్టరే ప్రధానం ఈ సినిమాలో. అందులో సాయిపల్లవి ఈ క్యారెక్టర్ లో జీవించేసింది. దీనిని ఆమె తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నంతగా. దీనివల్ల వెన్నెల క్యారెక్టర్ కూడా చాలా రోజులు తెలుగు ప్రేక్షకులు తలుచుకుంటూనే ఉన్నారు.

సీత:

తెలుగు ప్రేక్షకుల నోళ్ళల్లో పదేపదే వినిపించిన మరో ఫిమేల్ క్యారెక్టర్ పేరు సీత. రెండు సినిమాల్లో ఈ పేరు ఆకట్టుకుంది, హిట్ కొట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ పాత్ర పేరు సీత. అలాగే సీతారామం సినిమాలో మృణాళ్ పేరు కూడా సీతనే. సీతారామంలో హీరోయిన్ క్యారెక్టరే కీలకం. లెఫ్టినెంట్ రామ్ కు ఉత్తరాల్లో ప్రేమను పండించడమే కాకుండా అతనితో వెళ్ళిపోయే తెగువ చూపించిన పాత్ర ఇది. ఎంతో అందంగా, ప్రేమను పండించిన ఈ క్యారెక్టర్ అందరి గుండెల్లోనూ నిలిచిపోయింది. అలాగే ఆర్ఆర్ఆర్ లో రామరాజు మరదలిగా సీత క్యారెక్టర్ చిన్నది అయినా ఆలియా భట్ వేయడం వలన అందరికీ గుర్తుండిపోయింది.

కళావతి:

సర్కార్ వారి పాటలో హీరోయిన్ పేరు కళావతి. ఈ సినిమా హిట్ కాలేదు. అలాగే ఇందులో కళావతి క్యారెక్టర్ వేసిన కీర్తి సురేష్ కూ అంతపేరు రాలేదు. కానీ కమాన్ కమాన్ కళావతి అనే పాట ఇందులో ఉండడం, ఆ పాట హిట్ అవడం వలన ఈ పేరు మాత్రం బాగా గుర్తుండిపోయింది.

నీలాంబరి:

పాట వలన హిట్ అయిన మరో క్యారెక్టర్ నీలాంబరి. ఆచార్య సినిమాలో పూజాహెగ్డే చేసిన ఈ క్యారెక్టర్ సినిమాలో పెద్దగా ఉండదు. క్యారెక్టరూ గొప్పది కాదు. కానీ నీలాంబరి అనే పాట ఉంటుంది. అది బాగానే హిట్ అయింది. దాంతో ఈ పేరు కూడా బాగానే గుర్తుండిపోయింది.

యశోద:

సంవత్సరం చివర్లో వచ్చిన సినిమా ఇది. ఫుల్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూడీ. సమంత చేసిందీ క్యారెక్టర్. ఈ ఏడాది సమంత విడాకులు, తర్వాత ఆమెకు ఒంట్లో బాగోలేకపోవడం వలన తనపై ఎక్కువ ఫోకస్ ఉంది. దానివల్ల ఈ సినిమా మీద కూడా పుల్ ఫోకస్ వచ్చింది. అనుకున్నట్టు పెద్ద హిట్ అవ్వలేదు కానీ యశోద పేరు మాత్రం జనాల నోళ్ళల్లో బాగా నానింది.

సర్పంచి నాగలక్ష్మి:

బంగార్రాజు 2 సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు ఇది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది కానీ హీరోయిన్ గా చేసిన కృతిశెట్టికి మంచి మార్కులే పడ్డాయి. యంగ్ ఏజ్ లోనే సర్పంచి అయి, అల్లరి పల్లెటూరి అమ్మాయిగా కృతి చేసిన క్యారెక్టర్ బాగానే మెప్పించింది.

ఇవి కూడా చదవండి : 

అర్ధం పర్ధం లేకుండా ఉంది.

మరో వివాదంలో రష్మిక.. సౌత్ ఇండస్ట్రీపై వెగటు కామెంట్స్