నడిబజార్లో పోర్న్ మూవీ ప్రసారం.. ట్రాఫిక్ జామ్ - MicTv.in - Telugu News
mictv telugu

నడిబజార్లో పోర్న్ మూవీ ప్రసారం.. ట్రాఫిక్ జామ్

March 21, 2018

కామాతురాణం న భయం న లజ్జ.. అంటారు. ఆ కథలే వెరైటీగా ఉంటాయి. ఎక్కడ ఎవరికి ఏమైందో తెలియదుగాని నడిరోడ్డుపై పబ్లిక్ మందలు మందలుగా తిరిగే బాజరులో డిజిటల్ బిల్‌బోర్డులో అశ్లీల చిత్రం ప్రసారమైంది. రోడ్డుపై వెళ్తున్న జనం ఇదే అదను అక్కడే ఆగిపోయి ఆ చిత్రరాజాన్ని వీక్షించారు. కొందరైతే సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు.

దీంతో ఆ ప్రాంతంలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అరనిమిషంలోనే అంతా సర్దుకుంది. బోర్డుపై ఆ సీన్ల పోయి రోజువారీ సీన్లు రావడంతో జనం ఉస్సూరుమని కదిలిపోయారు.

ఫిలిప్పీన్స్‌లోని మకాటీ నగరంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ సీన్ జరిగింది. అరనిమిషం పాటు పోర్న్ క్లిప్ ప్రసారమైంది. ఫిలిప్పీన్స్‌లో అశ్లీల చిత్రాలు చట్టవిరుద్ధం. వాటిని తీసినా, ప్రదర్శించినా కఠిన శిక్షలు పడతాయి. మరి అలాంటి చోట ఈ పోర్న్ మూవీ ఎలా రోడ్డుపైకి వచ్చిందో విచారణ జరుపుతున్నారు. టీమ్ వ్యూవర అనే సాఫ్ట్‌వేర్ వాడటంతో ఈ బూతుపురాణం జరిగిందని భావిస్తునారు. బిల్ బోర్డు ఆపరేట్లర్లు ఎవరైనా.. పోర్న్ మూవీ చూస్తూ కావాలనో, పొరపాటునో దీన్ని ప్రదర్శించి ఉండొచ్చని భావిస్తున్నారు