తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో హోటల్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. సికింద్రాబాద్‌లోని బసేరా హోటల్లో కొంతమంది యువతులతో హూటల్ యాజమాన్యం అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హోటల్‌పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో అర్థనగ్నంగా నృత్యాలు చేస్తున్న 8 మంది యువతులను, 25 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకొని, హూటల్ను సీజ్ చేశారు.
అనంతరం అదుపులోకి తీసుకున్న యువతి, యువకులను గోపాలపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. హోటల్లో ఎప్పటి నుంచి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి? అదుపులోకి తీసుకున్న యువతి, యువకుల చిరునామాలు ఏంటీ? అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు.
మరోపక్క ఇటీవలే జూబ్లీహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌పై పోలీసులు దాడి చేసి, 142 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఘటన మరవకముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడంతో సంచలనంగా మారింది.