కారుకు రూ. 10 లక్షల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

కారుకు రూ. 10 లక్షల జరిమానా

November 30, 2019

పెద్దోళ్ల చిన్నబుద్ధులు అంటే ఇవే. అతడు లక్షల ఖరీదు చేసే పోర్షే కంపెనీ కారు కొనుక్కున్నాడు. తనది ఖరీదైన కారని, తను పెద్దమనిషిని అని, తనను ఎవరూ ఏమీ చేయలేరని తెగ ఫీలైపోయాడు. ఇష్టమొచ్చినట్లు కారును నడిపాడు. సరైన డాక్యుమెంట్లు లేవు. అసలు నంబరు ప్లేటే లేదు. కానీ కాలం కాసుకుని కూర్చుంది. పోలీసులు అడ్డంగా పట్టుకున్నారు. కారు నేరాల చరిత్ర చిట్టా విప్పి  20 వేలు తక్కువ రూ.10 లక్షల జరిమానా విధించారు. 

Porsche car.

గుజరాత్‌లోని అహ్మబాద్‌లో జరిగిందీ తతంగం. హెల్మెల్‌ క్రాస్‌రోడ్‌ వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వెండి రంగు కారు పోర్షే(911 ఎస్) కారును ఆపారు. దానికి నంబర్‌ ప్లేట్‌ లేదు. ఆర్సీ కూడా లేదు. దీంతో కారును అక్కడే ఆపి వివారాలు రాబట్టారు. దానిపై ఇప్పటికి వరకు 9.8 లక్షల చలాన్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు కట్టి కారును తీసుకుపోవచ్చన్నారు. మన దేశంలో ఒక కారుకు ఇంత మొత్తంలో జరిమానా పడ్డం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు. జర్మనీకి చెందిన పోర్షే కార్లు ఖరీదైనవి.  911 కార్రెరా ఎస్‌ వేరియంట్ ధర రూ.1.82 కోట్లు, 911 కార్రెరా ఎస్‌ కాబ్రియోలెట్‌ ధర దాదాపు రూ. 2 కోట్లు.