విద్యార్థుల ప్రాణాలు కాపాడిన కౌగిలి(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థుల ప్రాణాలు కాపాడిన కౌగిలి(వీడియో)

October 20, 2019

ముద్దుల, కౌగిలింతలు కూడా కొన్ని ఎమోషన్స్‌ను అదుపు చేయగలవు అంటారు. వాటిని సరైన సమయంలో వాడితే కొన్ని ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ నేపథ్యంలోంచే కొందరు హనీట్రాప్ అనే మాయదారి వలను ఏర్పరిచారు. అయితే అలా కాకుండా మంచికి కూడా ముద్దులను, కౌగిలింతలను కూడా ఉపయోగించవచ్చు అని నిరూపించింది ఈ ఘటన. అమెరికాలోని నిత్యం గన్నుల మోతలు అక్కడ సర్వసాధారణం అన్న విషషం తెలిసిందే. ఒరెగాన్‌లో ఓ విద్యార్థి ఉన్మాదిగా మారాడు. గన్ పట్టుకుని ఆగ్రహంతో తరగతి గదిలోకి ప్రవేశించాడు. ఈ సమాచారం తెలియగానే ఆ స్కూల్‌లోని ఫుట్‌బాల్ కోచ్ పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. తన ప్రాణాలకు తెగించి.. ఆ విద్యార్థిని కౌగిలించుకున్నాడు. అనంతరం అతడి నుంచి గన్ లాక్కుని క్లాస్‌‌రూమ్‌లో విద్యార్థులను రక్షించాడు.

మే17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్క్‌రోజ్ హైస్కూల్‌లో చదువుతున్న గ్రాండాస్ డియాజ్(19) గన్‌తో క్లాస్ రూమ్‌లోకి ప్రవేశించాడు. అతన్ని గన్‌తో అలా చూసేసరికి అందరూ ప్రాణభయంతో బిక్కచచ్చిపోయారు. ఇది గమనించిన ఫుట్‌బాల్ కోచ్ కీనాన్ లోవే వెంటనే వెళ్లి అతడిని కౌగిలించుకున్నాడు. అతడిని మాటల్లో పెట్టి చేతిలో గన్ లాక్కున్నాడు. అనంతరం ఆ గన్‌ను టీచర్‌కు ఇచ్చి దూరంగా తీసుకెళ్లమన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో అక్టోబర్ 20న బయటకు వచ్చింది. 

ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి పూనుకున్న సదరు ఫుట్‌బాల్ కోచ్‌ను అందరూ తమ కామెంట్లతో మెచ్చుకుంటున్నారు. అతనికి గనక ఆ ఉపాయం రాకపోయివుంటే అతను ఎంతమంది ప్రాణాలు బలిగొనేవాడోనని అంటున్నారు. అయితే నిందితుడు గ్రాండాస్‌కు కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. మానసిక ఆందోళన నుంచి బయటపడేందుకు చికిత్స అందించాలని పేర్కొంది. అతను ఈ దురాగతానికి ఎందుకు ప్రయత్నించాడనేది తెలియరాలేదు. కాగా, తాను ఇతరులను చంపడానికి అక్కడికి వెళ్లలేదని, క్లాస్ రూమ్‌లో తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకోడానికి వెళ్లానని గ్రాండాస్ పేర్కొన్నాడు.