Posani Krishna Murali is the Chairman of AP Film Development Corporation
mictv telugu

పోసానికి కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్

November 3, 2022

అధికారంలోకి రాకముందు వైసీపీలో చేరి పార్టీ తరపున ప్రచారం చేసిన సినీ నటులకు ఇప్పుడు వరుసగా పదవులు లభిస్తున్నాయి. మొన్న ప్రముఖ కమెడియన్ అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించగా, ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. ఆయనను ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అలీ మాదిరే పోసాని కూడా 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీ వాదన, జగన్ వాదనలను బలంగా సమర్ధించారు. కాగా, అంతకు ముందు ఈ పదవి మోహన్ బాబును వరిస్తుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పోసానికి దక్కింది. అటు వైసీపీకి ప్రచారం చేసిన సినీ నటులు చాలా మంది ఉన్నారు. జయసుధ, హేమ, రాజా రవీంద్ర, భానుచందర్, కృష్ణుడు, శ్యామల తదితరులు ఉన్నారు. మరి వీళ్లలో ఎంతమందికి పదవులు వస్తాయో చూడాలి.