లోకేశ్ పేరుతో బంగారు నందిని ఇచ్చుకోండి.. - MicTv.in - Telugu News
mictv telugu

లోకేశ్ పేరుతో బంగారు నందిని ఇచ్చుకోండి..

November 21, 2017

ఏపీ ప్రభుత్వం ప్రటించిన నంది అవార్డులపై నటుడు, సినీ రచయిత పోసాని కృష్ణ మురళి భగ్గుమన్నాడు. తనకు ప్రకటించిన నంది అవార్డును స్వీకరించని అన్నాడు.‘అవార్డులను రద్దు చేసి మళ్లీ ప్రకటించాలి.. అవార్డుల ఎంపిక విధానాన్ని విమర్శిస్తున్న వారిపై మంత్రి లోకేశ్, సీం చంద్రబాబు చేసిన విమర్శలు సరికావు.. నంది అవార్డులు మీ సొత్తా? ఏపీతో సంబంధం లేకుండా తెలంగాణలో ఉన్న వారు విమర్శలు చేయొద్దనడం సబబు కాదు. మేం తెలుగువాళ్లం కామా? విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా?’ అని ఆయన ప్రశ్నించాడు. కమ్మవాళ్లకు ఎక్కువగా అవార్డులు ఇవ్వడంతో సహజంగానే అనుమానాలు వస్తాయన్నారు. కమ్మవాళ్లకే నంది అవార్డులు ఇచ్చుకోవాలంటే లోకేశ్ పేరుతో బంగారు నంది ఇవ్వాలని ఎద్దేవా చేశారు.