మీరు సుకన్య సమృద్ధి స్కీంలో చేరలేదా. మీ పాప వయస్సు పదేళ్లు దాటిపోయిందా. అందుకే ఈ పథకంలో చేరలేదా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఎస్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సుకన్య స్కీంను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలంటూ అభిప్రాయపడింది. దీనిలో భాగంగానే కొత్త రిజిస్ట్రేషన్ల ప్రోత్సహానికి కీలక ప్రతిపాదన చేసింది.
కేంద్రం ద్రవ్యలోటు ఫైనాన్సింగ్ కోసం ఎక్కువగా చిన్న మొత్తాల పొదుపుపై ఆధారపడుతోందని ఎస్బిఐ రీసెర్చ్ వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ నుంచి కేంద్రం రూ. 5లక్షల కోట్లు పొందే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ క్రమంలోనే సుకన్య స్కీంలో కొత్త రిజిస్ట్రేషన్ల ప్రోత్సహానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని 12ఏళ్ల వరకు వయస్సున్న వారికి అందుబాటులో ఉంచాలని సిఫార్సు చేసింది.
కాగా ఈ స్కీంలో డిపాజిట్ల విషక్ష్ంలో బ్యాంకులు వాటాను కలిగి ఉన్నాయని, పోస్టాఫీసులు ఎక్కువ వాటను కలిగి ఉన్నాయని ఎస్ బిఐ తెలిపింది. అందుకే బ్యాంకులుకూడా బిజినెస్ కరస్పాండెట్ల ద్వారా ఈ స్కీం రిజిస్ట్రేషన్లు చేపట్టవచ్చని వెల్లడించింది. 10ఏళ్ల వయస్సున్నఆడపిల్లల పేరుపై ఈ స్కీం అకౌంట్ తెరిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీం 7.6శాతం వడ్డీ లభిస్తోంది. ఏజ్ లిమిట్ కారణంతో ఈ స్కీంకు దూరమైన వారు మళ్లీ ఈ పథకంలో చేరేందుకు అవకాశం లభించనుంది.
ALSO READ:
పది పాసైతే చాలు…నెలకు రూ.58,650జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు..!
‘నాతో చేతకాక.. నా కొడుకుపై కేసు పెట్టిస్తావా..?’ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
ఉప్పల్ వేదికగా కివీస్‌తో టీమిండియా తొలి వన్డే నేడు
తండ్రిని మించిన తనయుడు.. బండి సంజయ్ కొడుకుపై ఆర్టీవీ కామెంట్స్