ఏది పడితే అది పోస్టు చేస్తే జైలే!
స్మార్ట్ ఫోన్ యూజర్లకో స్మాల్ వార్నింగ్. వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూప్స్ లో ఏది పడితే అది పోస్టు చేస్తే కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఇక ముందు షేరింగ్ లో కేరింగ్ తప్పనిసరి తీసుకోవాలి. తప్పుడు సమాచారం, వదంతులు సృష్టించినా ,విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి పెట్టినా యూజర్‌తోపాటు అడ్మిన్ కూడా బాధ్యుడవుతాడు. నేరం రుజువైతే 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగం.ఫోన్ ఆన్ చేస్తే ఫోకసంతా ఫేస్ బుక్ , వాట్సాప్, ట్విట్టర్ పైనే.. వీటిలో ఏ పోస్టు పడితే ఆ పోస్టును షేర్ చేసేస్తుంటాం. నిజమో కాదో తెలుసుకోకుండానే పోస్ట్ చేస్తుంటారు. ఇలా సోషల్ మీడియాలో పుట్టే పుకార్లు తుఫాన్ కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్నాయి. నిమిషాల వ్యవధిలోనే లక్షల మందికి చేరుతున్నాయి. అలాంటి పుకార్లు, తప్పుడు సమాచారం వల్ల ఎలాంటి అనర్థాలు, నష్టాలు జరగకపోతే ఫరవాలేదు. కానీ… అవే వివాదాలకు, కొట్లాటలకు, విద్వేషాలకు దారి తీస్తే..? అదే సమాచారం జనాలను తప్పుదోవ పట్టించేదిగా ఉంటే..? ఎవరినైనా కించపరిచేలా ఉంటే..? అప్పుడు బాధితులు ఎవరితో చెప్పుకుంటారు..? వారికి న్యాయం ఎలా జరుగుతుంది..? అదే తప్పుడు సమాచారం, వదంతులు ఒక వేళ దేశ భద్రతకే ముప్పు కలిగించేవిగా ఉంటే..? అప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిందే. అలాంటి సమాచారం లేదా ఫొటోలు పెట్టిన వారిని వెతికి పట్టుకుని శిక్షించాల్సిందే.
అదిగో… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయా రాష్టాల్లో ఉన్న పోలీసులు చేస్తున్నది అదే. సామాజిక మాధ్యమాల్లో తెలియని, తప్పుడు సమాచారం పెట్టినా, వదంతులు సృష్టించినా, ఒకరిని కించ పరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టినా, జనాలను తప్పుదారి పట్టిస్తూ, విద్వేషాలు రెచ్చగొట్టే, వివాదాలకు కారణమయ్యే, కొట్లాటలకు దారి తీసే పోస్టులు పెట్టినా ఇకపై చట్టం చూస్తూ ఊరుకోదు. తనపని తను చేసుకుపోతుంది. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. నేరం రుజువైతే 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష వేస్తారు.
సో సోషల్ మీడియా పోస్టింగ్స్ , షేరింగ్ ల్లో కేరింగ్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే..లేదంటే విచారణలు , కేసులు తప్పకపోవచ్చు. బీ కేర్ ఫుల్ ఆన్ లైన్ యూజర్..
HACK:
If anyone shares or posts a wrong information on social media is a crime and have to face the consequences. One must go to the jail, If the offense is proven.