సీన్ రిపీట్.. సందీప్‌ వంగా బాలీవుడ్‌లోనూ మంట పెట్టాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

సీన్ రిపీట్.. సందీప్‌ వంగా బాలీవుడ్‌లోనూ మంట పెట్టాడు..

July 10, 2019

Kabir Singh Shahid Kapoor.

సినీపరిశ్రమలో జాతకం మారాలంటే ఓకే ఒక్క సినిమా చాలని మరోసారి ‘కబీర్ సింగ్’ రూపంలో రుజువైంది. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఎన్ని సినిమాలు చేసినా దక్కని ఘన విజయం ‘కబీర్ సింగ్’తో దక్కింది. తెలుగులో సంచలన విజయం సాధించిన తన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. 

ఇటీవల విడుదలైన ‘కబీర్ సింగ్’ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే 250 కోట్ల క్లబ్‌లో చేరిపోయి 300 కోట్ల దిశగా పరుగెడుతోంది. వివాదాలు కూడా తోడైనఈ విజయంతో షాహిద్ కపూర్ తన పారితోషికాన్ని ఒక్కసారిగా భారీగా పెంచేశాడనేది బీ టౌన్‌ మాట. కబీర్ సింగ్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న షాహిద్.. తన తదుపరి సినిమాల కోసం ఏకంగా 35 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ వార్త నిజమే అయితే  బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల సరసన నిలుస్తాడు.

ఈ సక్సెస్ వెనకాల సందీప్ రెడ్డి వంగా కృషి ఎంతగానో ఉంది. సందీప్ ‘అర్జున్ రెడ్డి’ విడుదల తరువాత హీరో విజయ్ దేరవకొండ  జాతకం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు చిన్ననటుడిగా, పెద్దగా ఎవరికీ తెలియని వాడి, తక్కువ పారితోషికంతో పరిపెట్టుకుంటూ వచ్చిన విజయ్ రాత్రికి రాత్రి సూపర్ హీరో అయిపోయాడు. అతని  డేట్స్ దొరకడం కష్టమైపోయింది. విజయ్ కూడా అర్జున్ రెడ్డి తరువాత తన పారితోషికాన్ని పెంచాడు. తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా బోలెడుఅవకాశాలు వచ్చాయి. ఇప్పుడు రెండు చేతుల్లో సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇది నాణేనికి ఒకవైపు అయితే.. కొందరు నిర్మాతలు సందీప్ సక్సెస్ చూసి రుసురుసలాడుతున్నారు. సందీప్ సినిమా నటులకు భారీ పారితోషికం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. అయితే వారి సినిమాలు సక్సెస్ అయితే లాభాలు దండుకునేది నిర్మాతలేనని, సినీ జూదంలో ఇలాంటివి సహజమనేని కొందరు అంటున్నారు.