'జాబులెక్కడ జగన్?' టీడీపీ నాయకులు - MicTv.in - Telugu News
mictv telugu

‘జాబులెక్కడ జగన్?’ టీడీపీ నాయకులు

March 10, 2022

08

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ.. టీడీపీ నాయకులు రోడ్డు ఎక్కారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం టీడీపీ శాసనసభా పక్ష నేతలు నిరసన తెలియజేశారు. హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం హామీ ఇచ్చినట్టు భర్తీ చేస్తామన్న 2.30 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా జాబులు ఎక్కడ జగన్ రెడ్డి? అంటూ బ్యానర్‌ను ప్రదర్శించారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగుల వయోపరిమితిని పెంచాలని నినాదాలు చేశారు. మాట తప్పిన జగన్ – మడం తిప్పిన ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్, కింజారపు అచ్చెన్నాయుడు, అశోక్ బాబు తదితర నేతలతోపాటు పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం ఏపీలో టీడీపీ సభ్యులు ఏపీలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరసన తెలపటం ఆసక్తికరంగా మారింది.