ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ఎదుట హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే హైదరాబాద్ లో బై బై మోదీ అంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. తాజాగా కవిత ఈడీ విచారణ సమయంలోనూ ఈ పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. ఈడీ,సీబీఐలతో బీజేపీ బెదిరింపులకు పాల్పడుతుందంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరక ముందు, చేరిన తర్వాత అంటూ నగరంలో పలుచోట్ల పోస్టర్లు అంటించారు.
ఈ ఫ్లెక్సీల్లో కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింథియా, అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ నేత సువేంధు అధికారి, ఏపీలో సుజనాచౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే ఫొటోలను ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు.