Postmortem report of Umamaheswari
mictv telugu

ఉమామహేశ్వరి పోస్టుమార్టం నివేదిక.. ఎలా చనిపోయిందో చూడండి

August 5, 2022

స్వర్గీయ ఎన్టీరామారావు చిన్న కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి ఈనెల 1న చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో నందమూరి కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతవరకు వారి కుటుంబంలో ప్రమాదం వల్ల చనిపోయిన వారు ఉన్నారు కానీ, ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా ఉమామహేశ్వరి పోస్టుమార్టం నివేదిక వచ్చింది. ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు ఆ నివేదికను జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేశారు. అందులో పేర్కొన్న ప్రకారం.. ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది నిజమేనని తేల్చారు. మెడ భాగంలో స్వర పేటిక బ్రేక్ అవడం వల్ల చనిపోయిందని స్పష్టం చేశారు.