ఆలయంలో లంకెబిందె.. కేజీన్నర బంగారు నాణేలు లభ్యం - MicTv.in - Telugu News
mictv telugu

ఆలయంలో లంకెబిందె.. కేజీన్నర బంగారు నాణేలు లభ్యం

February 27, 2020

fbcvfn

తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలోని జంబుకేశ్వర్‌ ఆలయంలో బంగారంతో నిండిన కుండ బయటపడింది. దాని నిండా 505 బంగారు నాణేలను గుర్తించారు. అఖిలాండేశ్వరి సన్నిధి చుట్టూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు కూలీలు తవ్వకాలు ప్రారంభించారు. ఈ సమయంలో ఇనుముతో చేసిన ఓ కుండ తగిలింది. వెంటనే దాన్ని తెరిచి చూడగా పురాతన కాలం నాటి బంగారు నాణేలు కనిపించాయి. వీటి బరువు దాదాపు 1.7 కేజీలు ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న పురావాస్తు అధికారులు అక్కడి వచ్చి వాటిని పరిశీలించారు.  ఆర్కియాలజీ అధికారులు తవ్వకాలను చేపట్టారు. 

tt

అకిలాండేశ్వరి సమేదా జంబుకేశ్వర ఆలయాన్ని 1800 సంవత్సరాల క్రితం చోళ అధిపతి కొట్చెంగన్నన్ నిర్మించినట్లు స్థానికులు నమ్ముతారు. ఈ ఆలయం పెద్ద పెద్ద కట్టడాలతో నిర్మించబడింది. దీంతో ఆనాటి ఆధారాల కోసం తవ్వకాలను చేపట్టారు. ఇంకా భూమిలోపల ఏమైనా దాగి ఉన్నాయేమోనని పరిశీలిస్తున్నారు. బంగారం బయటపడిన కుండలో నాణేల్లో చారిత్రక శాసనాలు, చిహ్నాలు ఉన్నట్లు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. ఇంత పెద్ద ఎత్తున బంగారు నాణేలు బయటపడటంతో అంతా దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 

u