ఒక పొటాటో చిప్ ధర రూ. 1.63 లక్షలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఒక పొటాటో చిప్ ధర రూ. 1.63 లక్షలు..

May 12, 2022

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేల ఖరీదైన పుట్టగొడుగులు తింటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంగతి పక్కనబెడితే జానెడు కడుపు నింపుకోడానికి తినే తిండిలో ఎన్నెన్నో వింతలు విడ్డూరాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. లక్షల ఖరీదైన టీ, పుచ్చకాయ, గుమ్మడికాయ వంటివెన్నో ఉన్నాయి. తాజాగా వీటిలో ఓ బంగాళాదుంప చిప్ కూడా చేరిపోయింది. ఒకే ఒక పొటాటో చిప్‌ను రూ. 1.63 లక్షలకు అమ్మకానికి పెట్టాడో ప్రబుద్ధుడు. బ్రిటన్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌కు చెందిన ఓ వ్యాపారి ఈ చిప్‌ను ప్రముఖ వేలం సంస్థ ఈబేలో వేలానికి ఉంచాడు. ‘దీని పేరు పింగిల్ పొటాటో. కాస్త పుల్లగా, ఉల్లిగడ్డ వాసనతో ఉంటుంది. ఇది తాజా చిప్. ఎక్కడా దెబ్బతినకుండా పర్‌ఫెక్టుగా ఉంది’ అని చెప్పుకొస్తున్నాడు. దీన్ని చాలా మంది కొనుగోలుదారులు చూస్తు మరిన్ని వివరాలు కావాలంటున్నారు. రూపాయి కూడా పలకని ఇలాంటి వాటిని భారీ ధరలకు వేలం వేయడం కొత్తేం కాదు. ఇదివరకు మెక్‌డొనాల్డ్స్ కంపెనీ ఒక చికెన్ ముక్కను రూ. 73 లక్షలకు అమ్మకానికి పెట్టింది.